ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు.. 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
అసలే కరోనా విపత్తుతో థియేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు ఏపీలో టికెట్ ధరలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది థియేటర్ల పరిస్థితి. ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఏపీలో సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోనున్నాయి.
జూలై 31నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అది కేవలం 50 శాతం అక్యుపెన్సీతోనే. శానిటైజర్స్, మాస్కులు, భౌతిక దూరంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.
థియేటర్ల రీ ఓపెన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 13 జిల్లాలోని థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు అత్యవసర సమావేశం అయ్యారు. 50 శాతం సీటింగ్ తో థియేటర్లు నడిపితే తమకు నష్టం అని అంటున్నారు.ఈ మేరకు తమని ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
థియేటర్ యజమానులు సమావేశంలో టికెట్ ధరలు, కోవిడ్ విషయంలో తెసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం జూలై 8 నుంచే థియేటర్లు తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. కానీ ఆ సమయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదంతో అప్పుడు థియేటర్లు ఓపెన్ కాలేదు. కాగా ఏపీ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్ కు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శుక్రవారం తిమ్మరుసు, ఇష్క్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com