తెలంగాణాలో తెరుచుకోనున్న థియేటర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు దఫాలుగా సినీ ప్రముఖులు.. సీఎం కేసీఆర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. హామీ ఇచ్చిన ప్రకారం కేసీఆర్.. సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. నేడు విడుదల చేసిన టీఆర్ఎస్ మేనిఫెస్టో ద్వారా థియేటర్లను ఓపెన్ చేసేందుకు సానుకూల వాతావరణాన్ని కల్పించారు. రూ.10 కోట్లు లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌ను ప్రకటించారు. అలాగే 10 కోట్ల పైబడి నిర్మాణమయ్యే సినిమాల విషయంలో కొన్ని ఇతర రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా.. థియేటర్ వారి ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.
6 నెలలు థియేటర్లలో కరెంట్ బిల్లు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలని.. థియేటర్లలో తప్పనిసరిగా శానిటైజర్లను ఉంచాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. థియేటర్ల వద్ద గుంపులు గుంపులుగా తిరగడం నిషేధమని కేసీఆర్ తెలిపారు.
ప్రతి షో ముందు కామన్ ఏరియాలో శానిటైజేషన్ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. థియేటర్లలో టెంపరేచర్‌ను 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య మెయిన్‌టైన్ చేయాలని సూచించారు. సినిమా పరిశ్రమలో ఉన్న దాదాపు 40వేల కార్మికులకు రేషన్ కార్డ్, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో థియేటర్లు తెరిచేందుకు సానుకూలమైన వాతావరణం ఏర్పడినట్టైంది. తెలంగాణ ప్రజానీకం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న తరుణమిది. దీంతో ఏ క్షణమైనా థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout