తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన థియేటర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మంచి రోజు కావడంతో థియేటర్ల యాజమాన్యం నేటి నుంచి థియేటర్లను పునః ప్రారంభించింది. లాక్‌డౌన్ కారణంగా మార్చిలో మూతపడిన థియేటర్లు.. 9 నెలల తర్వాత నేడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే.. థియేటర్లోకి నేరుగా విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కావడం విశేషం. కరోనా నేపథ్యంలో మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించేలా అన్ని జాగ్రత్తలనూ థియేటర్ల యజమానులు తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ప్రేక్షకులకు థియేటర్‌లోనికి సిబ్బంది అనుమతిస్తోంది.
తొమ్మిది నెలల తర్వాత ఏ సినిమా మొదట రిలీజ్ అవుతుందనే దానిపై కొద్ది రోజుల క్రితమే సస్పెన్స్ వీడిపోయింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం.. థియేటర్ల యాజమాన్యానికి ఒక భరోసా అయితే ఇచ్చేసింది. కానీ ఇన్ని నెలల తర్వాత.. అది కూడా ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంకు అలవాటు పడిపోయిన జనం.. మరోవైపు కోవిడ్ కొత్త రూపు దాల్చుకున్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్ల బాట పడతారా? లేదా? అన్నది కాస్త సందేహంగా మారింది. దీనికి కూడా నేటితో తెరపడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments