తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన థియేటర్లు..

  • IndiaGlitz, [Friday,December 25 2020]

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మంచి రోజు కావడంతో థియేటర్ల యాజమాన్యం నేటి నుంచి థియేటర్లను పునః ప్రారంభించింది. లాక్‌డౌన్ కారణంగా మార్చిలో మూతపడిన థియేటర్లు.. 9 నెలల తర్వాత నేడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే.. థియేటర్లోకి నేరుగా విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కావడం విశేషం. కరోనా నేపథ్యంలో మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించేలా అన్ని జాగ్రత్తలనూ థియేటర్ల యజమానులు తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ప్రేక్షకులకు థియేటర్‌లోనికి సిబ్బంది అనుమతిస్తోంది.

తొమ్మిది నెలల తర్వాత ఏ సినిమా మొదట రిలీజ్ అవుతుందనే దానిపై కొద్ది రోజుల క్రితమే సస్పెన్స్ వీడిపోయింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం.. థియేటర్ల యాజమాన్యానికి ఒక భరోసా అయితే ఇచ్చేసింది. కానీ ఇన్ని నెలల తర్వాత.. అది కూడా ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంకు అలవాటు పడిపోయిన జనం.. మరోవైపు కోవిడ్ కొత్త రూపు దాల్చుకున్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్ల బాట పడతారా? లేదా? అన్నది కాస్త సందేహంగా మారింది. దీనికి కూడా నేటితో తెరపడనుంది.

More News

అల్లు అర్జున్ నాకు లైన్ వేసేవాడు: నటి షాకింగ్ కామెంట్స్

వనితా విజయ్ కుమార్.. ఆమె సినిమాల్లో నటించే సమయంలో ఎందరికి తెలుసో.. తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఫిక్స్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పేరు ఫిక్స్ అయిందా? అంటే ఆ పార్టీ నేతల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.

దేశ ప్రధానికి వ్యతిరేకంగా కోర్టులో దావా.. రూ.900 కోట్లు డిమాండ్..

దేశ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ప్రజానీకాన్ని ఎక్కడైనా చూశారా? ఎన్నికల్లో అయితే ఓకే కానీ.. దేశ ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలే కోర్టు మెట్లక్కడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.

యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా..

తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగాయా? తగ్గాయా?

సాయితేజ్‌ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, సాధించుకున్న సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌