తమిళనాడులో థియేటర్స్ బంద్ విరమణ...
- IndiaGlitz, [Friday,July 07 2017]
కేంద్ర ప్రభుత్వం విధించిన సినిమా టికెట్స్‌పై 30 శాతం పన్నును రద్దు చేయాలంటూ థియేటర్స్ యజమానులు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్ యాజమాన్యం డిమాండ్స్‌ను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను గురువారం విరమించారు.జిఎస్‌టికారణంగా టికెట్స్‌పై 30 శాతం పన్ను చెల్లించడం వల్ల థియేటర్స్ భారీగా నష్టపోవాల్సి ఉంటుందని భావించిన థియేటర్స్ యాజమాన్యం సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. తమిళనాడులోని వెయ్యి థియేటర్స్ బంద్ చేయడం గమనార్హం. సమ్మె కారణంగా ప్రతి రోజూ 20 కోట్ల ఆదాయాన్ని నష్టపోయామని థియేటర్స సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ తెలిపారు.