నిర్మాత‌ల‌కు థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఆల్టిమేట్టం..!

  • IndiaGlitz, [Thursday,February 04 2021]

దాదాపు ఏడెనిమిది నెల‌ల త‌ర్వాత థియేట‌ర్స్ మ‌ళ్లీ తెరుచుకున్నాయి. ముందు యాబై శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అయిన థియేట‌ర్స్ త‌ర్వాత వంద శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ కావ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ త‌రుణంలో, సినిమా థియేట‌ర్స్‌కు ఓటీటీల రూపంలో కొత్త స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. నిర్మాత‌లు త‌మ సినిమా బిజినెస్‌లో భాగంగా ఓటీటీల‌కు డిజిట‌ల్ హ‌క్కుల‌ను విక్ర‌యిస్తుంటారు. సినిమా విడుద‌లైన రెండు వారాల‌కే డిజిట‌ల్ సంస్థ‌లు స‌ద‌రు సినిమాల‌ను త‌మ సంబంధిత ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌ద‌రు సినిమా హ‌క్కుల‌ను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు స‌మ‌స్యలు వ‌స్తున్నాయి. ఓటీటీల్లో సినిమాలు రావ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కుడు థియేట‌ర్ వైపు అడుగులు వేయ‌డం లేదు.

దీనికి సంబంధించి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ మ‌ధ్య చ‌ర్చలు జ‌రిగాయి. కోవిడ్ నేప‌థ్యంలో వంద శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ ఓపెన్ అయిన నేప‌థ్యంలో థియేట‌ర్స్ దానిపై ఆధార‌ప‌డ్డ‌వారు బ‌త‌కాలంటే ఓటీటీల్లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌పై ప‌రిమిత టైమ్‌లైన్ విధించాల‌ని లేకుంటే థియేట‌ర్స్ రైట్స్ ప‌రంగా నిర్మాత‌ల‌కు ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ మీటింగ్‌లో పాల్గొన్న నిర్మాత‌లు సురేష్‌బాబు, ఏషియ‌న్ సునీల్‌, మైత్రీ మూవీస్, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ వంటి వారికి వివ‌రించారు. పెద్ద సినిమాలైతే ఆరు వారాల గ‌డువుతో ఓటీటీల్లో విడుద‌ల చేయాల‌ని, చిన్న సినిమాలు, ఓ మోస్త‌రు సినిమాలైతే నాలుగు వారాల వ్య‌వ‌థితో ఓటీటీల్లో విడుద‌ల చేస్తే బావుంటుంద‌ని, లేకుంటే మార్చి 1 నుంచి థియేట‌ర్స్ మూత ప‌డుతుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నిర్మాత‌ల‌తో చెప్పారు. మ‌రిప్పుడు నిర్మాత‌లు థియేట‌ర్స్‌ను కాపాడుకునే దిశ‌గా ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

More News

హీరోతో పెళ్లి... అమెరికాలో ఉద్యోగానికి టాటాబైబై

హీరోతో పెళ్లి... అదీ మహేష్ బాబుకు 'ఒక్కడు', ప్రభాస్ కు 'వర్షం', తమిళ్ హీరో సిద్ధార్థ్ కు తెలుగులో ఇమేజ్ రావడానికి కారణమైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'

మాల్దీవుల్లో ప్రభాస్ పెదనాన్న & ఫ్యామిలీ

ట్వంటీ-ట్వంటీలో అందర్నీ అట్ట్రాక్ట్ చేసిన లొకేషన్. కొత్తగా పెళ్లైన కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లూ, నిహారిక కొణిదల - వెంకట చైతన్య జొన్నలగడ్డ హనీమూన్ ట్రిప్ వేసిందీ...

మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్

పొరపాట్లు మానవ సహజం.. కానీ అవి ప్రాణం మీదకు వచ్చేవైతేనే కష్టం. సీరియస్‌గా జరుగుతున్న సమావేశంలో అనుకోని ఘటన జరిగింది.

‘చెక్’ ట్రైలర్: ఏదీ కర్మను తప్పించుకోలేదు

‘భీష్మ’తో హిట్ కొట్టిన అనంతరం యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

'వివాహ భోజనంబు'లో తొలి పాట 'ఎబిసిడి...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.