తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

  • IndiaGlitz, [Sunday,November 01 2020]

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యజమానులు మాత్రం ఓపెన్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పలు సినిమాలు ప్రారంభమైనప్పటికీ ఇంకా ప్రారంభం కావల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని నెలలపాటు షూటింగ్స్ ఆగిపోవడంతో ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో చిత్రీకరణ జరుపుకోలేదు. షూటింగ్ పూర్తయిన పలు సినిమాలు ఓటీటీలో ఇప్పటికే విడుదలయ్యాయి.

కాగా.. థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ విడుదలకు ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ సిద్ధంగా లేకపోవడం ఒక కారణమైతే.. కరోనా నిబంధనల కారణంగా వచ్చే ఆదాయం.. థియేటర్ల మెయింటెనెన్స్‌కు సరిపోతుందో లేదోనన్న భయం... ఒకవేళ థియేటర్లు తెరిచినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు థియేటర్ల మెట్లు ఎక్కుతారో లేదో.. కనీసం ఏర్పాటు చేసిన 50 శాతం ఆక్యుపెన్సీ తో సీట్లైనా నిండుతాయో లేదోననే భయం.. ఇలా రకరకాల కారణాల మధ్య థియేటర్లను ఓపెన్ చేసేందుకు యజమానులు సంసిద్దత వ్యక్తం చేయలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు తొలి స్టెప్ తీసుకుని..థియేటర్లను ఓపెన్ చేశారు. లాక్‌డౌన్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఓపెన్ చేసిన తొలి నగరం విజయవాడ కావడం విశేషం. రోజుకు మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా రెండు గంటల ముందే బాక్సాఫీస్ తెరుచుకోనుంది. క్యాష్ లెస్ ట్రాన్సక్షన్, పేపర్‌లెస్ టికెట్స్‌తో మల్టీప్లెక్స్‌లు నడవనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్ ఏర్పాట్లు జరిగాయి. వచ్చే ప్రతి ప్రేక్షకుడి ఫోన్ నంబర్ కంప్యూటర్‌లో సేవ్ చేయనున్నారు. మాస్కులు లేకుంటే వాటిని సైతం థియేటర్ల యాజామాన్యాలే సరఫరా చేయనున్నాయి. థియేటర్‌లో సరి బేసి విధానంలో సిట్టింగ్‌ను అమలు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరుచుకోవాల్సి ఉంది.

More News

రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు.

కిర్రాక్ ఫ్యాన్.. శ్రీకృష్ణుడిగా మహేష్ లుక్ అదుర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా పెద్దది.

అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను వాయించేసిన నోయెల్..

కులు మనాలి నుంచి హోస్ట్ నాగార్జున హెలికాఫ్టర్‌లో బయల్దేరుతున్న సీన్‌‌ను చూపించారు. మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ సాంగ్‌తో షోను స్టార్ చేశారు.

నటుడు రాజశేఖర్ కోలుకుటున్నారు: డాక్టర్ రత్న కిషోర్

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు.

తొలి జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ ఇక లేరు..

హాలీవుడ్ తొలి 'జేమ్స్ బాండ్' పాత్రధారి సీన్ కానరీ(90) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సీన్ కానరీ శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.