నలుగురిని ప్రేమించిన యువతి.. లక్కీ డ్రాతో వరుడి ఎంపిక!
Send us your feedback to audioarticles@vaarta.com
నలుగురిని సెలక్ట్ చెయ్.. ముగ్గురిని ట్రై చెయ్.. ఇద్దరిని లవ్ చెయ్.. ఒకరిని పెళ్లి చేసుకో.. అన్నట్టుంటుంది యూత్. కానీ ఓ యువతి మాత్రం డిఫరెంట్. సెలక్ట్.. ట్రై.. వంటివన్నీ పక్కనబెట్టేసి.. ఏకంగా నలుగురిని లవ్ చేసింది. ఇక వారితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్దలు ఆ యువతిని తిరిగి తీసుకొచ్చాక వచ్చింది పెద్ద చిక్కు. ఇక పెద్దలు ఆ చిక్కుముడి విప్పిన తీరు మరింత ఆసక్తికరం. ఇంతకీ ఏం చేశారంటారా? లాటరీ వేసి మరీ ఒకరిని సెలక్ట్ చేసి సదరు యువకుడికి ఇచ్చి ఈ యువతికి పెళ్లి జరిపిస్తున్నారు.
ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని అంబేడ్కర్‌నగర్‌లోని అజిమ్‌నగర్‌కు చెందిన యువతి నలుగురు యువకులను ప్రేమించింది. ఆ నలుగురు యువకులతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరంతా తెలిసిన వారింట్లో తలదాచుకున్నారు. అయితే యువతి కోసం గాలించిన కుటుంబ సభ్యులకు చివరకు ఆచూకీ దొరికింది. వెంటనే వారంతా తలదాచుకున్న ఇంటికి యువతి కుటుంబ సభ్యులు వెళ్లి వారిని తిరిగి తమ గ్రామానికి తీసుకొచ్చారు. వెంటనే నలుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు.
అయితే గ్రామపెద్దలు నచ్చజెప్పి పంచాయితీ నిర్వహించారు. గ్రామపెద్దల సమక్షంలో పలు మార్లు చర్చలు జరిగాయి. చివరకు నచ్చిన యువకుడిని పెళ్లాడాలంటూ యువతికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ యువతి మాత్రం నలుగురిలో ఎవరిని చేసుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. నలుగురిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాననే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాని తేల్చి చెప్పేసింది. దీంతో పంచాయితీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. చీటీలు వేసి వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. నలుగురు యువకుల పేర్లు చీటీల్లో రాసి ఓ చిన్నారి చేత లక్కీ డ్రా తీయించారు. చిటీలో పేరు వచ్చిన వ్యక్తితోనే సదరు యువతి వివాహం జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com