పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం తథ్యం: ప్రశాంత్ కిషోర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది తొలి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలను పీకే ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలను ప్రజాస్వామ్య పోరుగా ఆయన అభివర్ణించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం రాష్ట్ర ఎన్నికలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మే 2వ తేదీన తాను గత ట్వీట్‌లో చెప్పింది నిజమవుతుందని పేర్కొన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయంప మరోసారి ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా... దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుందని.. పశ్చిమ బెంగాల్ ప్రజలు వారి తీర్పుతో సిద్ధంగా ఉన్నారని పీకే పేర్కొన్నారు. బెంగాల్‌కు తమ సొంత కూతురే కావాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. అలాగే.. మే 2వ తేదీన తాను ట్వీట్‌లో చెప్పిందే నిజమవుతుందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
ఆయన గత ట్వీట్‌లో బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ అనుకూల మీడియా ప్రచారం తప్ప అక్కడ రెండంకెలను మించి సీట్లు సాధించలేదని పీకే తెలిపారు. తన అంచనా తప్పితే సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 29న ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. నిజానికి కూడా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments