అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు: రాజ్‌కుమార్ కుటుంబాన్ని వెంటాడుతున్న 'గుండెపోటు'
Send us your feedback to audioarticles@vaarta.com
అనువంశిక జబ్బుల విషయంలో వైద్యులు చేసే హెచ్చరికలను పెడచెవిన పెట్టరాదని చెబుతూ వుంటారు. పెద్దలకు వున్న ధీర్ఘకాలిక వ్యాధులు వారి తర్వాతి తరాన్ని కూడా వెంటాడుతూ వుంటాయి. వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధుల నుంచి మానవాళి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోతున్నారు. శుక్రవారం మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఆయన తండ్రి, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ మరణించిన విధంగానే పునీత్ కూడా గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం.
పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ హెల్త్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన పెద్దాయన.. ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో 2006 ఏప్రిల్ 12న ఎప్పటిలానే మార్నింగ్ వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చి.. 11.30 గంటల సమయంలో రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉన్నట్టుండి సోఫాలో కుప్పకూలిపోయారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు.. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్‌కుమార్ కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ఈ వార్త కర్ణాటక అంతటా దావానంలా వ్యాపించింది. అంతే కోట్లాది గుండెలు ముక్కలయ్యాయి. దైవంలా ఆరాధించే వ్యక్తి ఇక లేరనే వార్త తెలుసుకుని కన్నడిగులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆ తర్వాత కొన్నేళ్లు పునీత్ సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. 54 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా శివరాజ్ కుమార్ ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడంతో శివరాజ్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. నాటి నుంచి ఆయన జిమ్‌లో కష్టపడటం తగ్గించేశారు.
ఇక పునీత్ విషయానికి వస్తే.. ఆయన ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఉదయాన్ని జిమ్‌లో కొన్ని వర్కవుట్స్ చేయాల్సిందే. షూటింగ్ సమయంలో వీలుకుదరని పక్షంలో రన్నింగ్, వాకింగ్ వంటివి చేస్తారు. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. ఇందుకు మేకోవర్ చేసుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తుండగానే ఓ డేంజర్ స్ట్రోక్ ఆయనను బలి తీసుకుంది. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే చేయి దాటిపోవడంతో పునీత్ కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతూ కానరాని లోకాలకు తరలిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout