బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా దేశాన్ని వణికిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ప్రస్తుతం ఈ బ్లాక్‌ఫంగస్ సోకుతోంది. దీని కారణంగా రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది.బ్లాక్‌ ఫంగస్‌ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్‌ అవుతుంది. తద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. బ్లాక్ ఫంగస్‌ను సైతం కేంద్రం అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని నిర్ణయించింది. ఈ బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువని పరిశోధకులు తేల్చారు.

ఇదీ చదవండి: తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్?

కోల్‌కతాకు చెందిన జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైద్యుల బృందం దీనిపై పరిశోధనలు చేసింది. అరుదుగా సోకే బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకరమైనదని వైద్యుల బృందం వెల్లడించింది. ఇది సోకిన వారిలో 83 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులేనని వైద్యుల బృందం తేల్చింది. వీరిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువేనని పేర్కొంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యుల బృందం సూచించింది. తాము భారత్ సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగులను పరిశీలించినట్టు వైద్యుల బృందం వెల్లడించింది.

More News

ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి..

ఎయిర్ ఇండియాతో స‌హా ప‌లు అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌ల‌పై భారీ సైబ‌ర్ దాడి జ‌రిగింది. ప్రయాణికుల సేవల వ్యవస్థను అందిస్తున్న ‘ఎస్‌ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్‌ దాడులు జరగాయి.

ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇలా చెయ్యండి

ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అప్లై చేసెయ్యండి. మూడేళ్లుగా నిలిచిపోయిన పబ్లిక్ వెరిఫికేషన్‌‌ కార్యక్రమాన్ని ట్విటర్ తాజాగా ప్రారంభించింది.

తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్?

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఒక్కసారిగా ఏ రేంజ్‌లో విజృంభించిందో తెలియనిది కాదు. నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవడంతో ఈ పరిస్థితుల నుంచి బయటపడతామా..

50 హాస్పిటల్స్ కి ఫోన్ చేశా.. డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని

కోవిడ్ 19 చిక్కులు సెలెబ్రెటీలకు సైతం తప్పడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఎందరో ప్రముఖులు కరోనా బారీన పడి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.

నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీజీపీతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.