బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా దేశాన్ని వణికిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ప్రస్తుతం ఈ బ్లాక్‌ఫంగస్ సోకుతోంది. దీని కారణంగా రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది.బ్లాక్ ఫంగస్ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్ అవుతుంది. తద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. బ్లాక్ ఫంగస్‌ను సైతం కేంద్రం అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని నిర్ణయించింది. ఈ బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువని పరిశోధకులు తేల్చారు.
ఇదీ చదవండి: తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్?
కోల్‌కతాకు చెందిన జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్కు చెందిన వైద్యుల బృందం దీనిపై పరిశోధనలు చేసింది. అరుదుగా సోకే బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకరమైనదని వైద్యుల బృందం వెల్లడించింది. ఇది సోకిన వారిలో 83 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులేనని వైద్యుల బృందం తేల్చింది. వీరిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువేనని పేర్కొంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యుల బృందం సూచించింది. తాము భారత్ సహా అమెరికా, ఇరాన్లో బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగులను పరిశీలించినట్టు వైద్యుల బృందం వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com