Baby:'బేబీ' సినిమా కథ నాదే.. దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఇండస్ట్రీలో కాపీరైట్ వివాదాలు ఎక్కువుతున్నాయి. శ్రీమంతుడు సినిమా కథ వివాదం కొనసాగుతుండగానే తాజాగా బేబీ సినిమా కథ విషయంలో కాపీ రైట్ సమస్య తలెత్తింది. ఈ కథ తనదేంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ మూవీ మేకర్స్‌పై కేసు నమోదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాడు. అయితే 2013లో అతను 'బేబీ' సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్‌ని కలిసి కథ చెప్పాడని ఆరోపిస్తున్నాడు. తన కథను 'బేబీ' సినిమాగా తీశారని, కాపీరైట్స్ చట్టాన్ని ఉల్లంఘించాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. 2013లో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయమని రాజేశ్ తనని కోరాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2015లో తాను 'కన్నా ప్లీజ్' పేరుతో కథ రాసుకుని దానికి 'ప్రేమించొద్దు' అనే టైటిల్ పెట్టుకున్నానని తెలిపాడు. సాయి రాజేశ్ సూచనతోనే నిర్మాత ఎస్కేఎన్కి కథ చెప్పానని తెలిపారు. అదే కథతో 2023లో బీబీ సినిమాకు రాజేశ్ దర్శకత్వం వహించగా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించారని ఆరోపించారు. ఆ సినిమా మొత్తం 'ప్రేమించొద్దు' సినిమానే అని ఫిర్యాదు చేసిటన్లు పోలీసులు చెప్పారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
కాగా గతేడాది చిన్న సినిమాగా విడుదలైన 'బేబీ' సినిమా బ్లాక్బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కసూల వర్షం కురిపింది. ఇటు దర్శకుడు రాజేశ్, అటు నిర్మాతక ఎస్కేఎన్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఈ కథ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఇటీవల మహేశ్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమాపై కూడా కాపిరైట్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2013లో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి కొరటాల 'శ్రీమంతుడు' మూవీ తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా కొరటాలకు ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా కొరటాలకు తీవ్ర నిరాశే ఎదురైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout