శంక‌రాభ‌ర‌ణం అస‌లు క‌థ‌

  • IndiaGlitz, [Friday,October 30 2015]

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శంక‌రాభ‌ర‌ణం సినిమాకి స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన‌ శంక‌రాభ‌ర‌ణం ఆడియోను ఈరోజు రిలీజ్ చేస్తున్నారు.

ఇక శంక‌రాభ‌ర‌ణం క‌థ విష‌యానికి వ‌స్తే..బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పాస్ గ‌యా రే ఒబామా సినిమా ఆధారంగా శంక‌రాభ‌రణం సినిమాను రూపొందించిన‌ట్టు ర‌చ‌యిత & చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ లో తెలియ‌చేసారు. ఈరోజు గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేస్తున్న‌ శంక‌రాభ‌ర‌ణం మూవీని న‌వంబ‌ర్ 20న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.