ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌వుతున్న 'ది స్టోలెన్ ప్రిన్సెస్‌'

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌గా ఉండే అంశాలే. ఇలాంటి ఎలిమెంట్స్ ఆధారంగా తెర‌కెక్కించిన మ్యాజిక‌ల్‌, అడ్వేంచ‌ర‌స్‌, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన యానిమేటెడ్ ఫిలిమ్ 'ది స్టోలెన్ ప్రిన్సెస్‌'. ఈ ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, ఆంగ్ల భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ త్రీడీ యానిమేటెడ్ మూవీలో థ్రిల్ చేసే కాన్సెప్ట్ అందులోని స‌బ్ ప్లాట్స్‌తో పాటు బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉంది. ర‌స్‌లాన్.. మిలాను ప్రేమిస్తాడు. ఆమె దేశపు యువ‌రాణి అని ర‌స్‌లాన్‌కు తెలియ‌దు. అయితే ఓ కార‌ణంతో యువ‌రాణి మిలాను .. దుష్ట మాంత్రికుడు కోర్‌నోమోర్ కిడ్నాప్ చేస్తాడు.

ర‌స్లాన్ త‌న ప్రేయ‌సిని ఎలా కాపాడుకున్నాడు.. ఈ కాపాడే క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితులేంటి? ర‌స్‌లాన్‌కు యువ‌రాణిని కాపాడ‌టానికి ఎవ‌రెవ‌రు స‌హాయం చేశారు. అనే విష‌యాల‌ను అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతోరూపొందించారు. చెడుపై ఎప్పుడూ మంచే జ‌యిస్తుంద‌నే కాన్సెప్ట్‌తోనే ద‌ర్శ‌కుడు ఒలెగ్ మాల‌ముహ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యారోస్లావ్ వ్యోతెషేక్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ స‌మాహారంగా సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తెర‌కెక్కించారు.

More News

'ఆర్ ఎక్స్ 100' త‌మిళ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 'ఆర్‌.ఎక్స్100'. చిన్న చిత్రంగా విడుద‌లై పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా

'యు ట‌ర్న్‌' ట్రైల‌ర్ డేట్‌

సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్‌ కన్నడ ఫిల్మ్ 'యు టర్న్' సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

హ‌న్సిక హాఫ్ సెంచ‌రీ..

దేశ ముదురు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక .. తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే ధ‌నుశ్‌తో ఆమె న‌టించిన మాపిళ్ళై ఆమెకు త‌మిళంలో మంచి క్రేజ్‌ను తేవ‌డంతో

ఆకాశ్ 'అర‌ణ్యం'

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేసిన చిత్రం 'మెహ‌బూబా'. ఈ సినిమా ఆకాశ్‌కి త‌గినంత మేర స‌క్సెస్ కాలేదు.

'ఎఫ్ 2' చిత్ర కాన్సెప్ట్ అదే...

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్‌2'. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో