మూడోసారి కూడా అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్ల విషయంలో నాగ్ కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా తరువాత నాగ్ తనయుడు నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం రూపొందించాడు కళ్యాణ్. ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా కూడా చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. ఈ రెండు చిత్రాల్లోనూ పల్లెటూరి నేపథ్యం ఉంటుంది.
కాగా, కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్, నాగచైతన్యతో ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కూడా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ముచ్చటగా మూడోసారి కూడా పల్లెటూరి నేపథ్యాన్నే ఎంచుకున్న కళ్యాణ్.. హ్యాట్రిక్ విజయం అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమాలో వెంకీ, చైతన్య.. మేనమామ, మేనల్లుడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారమ్. మొత్తానికి.. వెంకీ, చైతూ నిజజీవితంలోని బంధాన్నే సినిమాల్లోనూ కొనసాగించనున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com