'ది రైజ్ ఆఫ్ శివగామి' సీరియల్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి ఫాంటసీ విజువల్ వండర్ బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు భారతీయ సినిమా అంతా ఎదురుచూస్తున్న `బాహుబలి 2` ఈ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి సినిమాను రెండు భాగాలు తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి అందులో ప్రతి పాత్రను చాలా శక్తివంతంగా తెరకెక్కించాడు.
అందులో ముఖ్యంగా మహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామి పాత్ర ఒకటి. ఈ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. ఇప్పుడు నీలకంఠన్ అనే రచయిత శివగామి పాత్రను, ఆమె మహిష్మతి రాణిగా ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ `ది రైజ్ ఆఫ్ శివగామి` అనే మూడు పుస్తకాలను రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ రాజమౌళి, రమ్యకృష్ణ, రానా సమక్షంలో జరిగింది. రాజమౌళి పుస్తకం గురించి మాట్లాడుతూ నీలకంఠన్‌గారు శివగామి పాత్రను వివరిస్తూ రాసిన ది రైజ్ ఆఫ్ శివగామి అద్భుతంగా ఉంది. కుదిరితే దీన్ని పన్నెండు, పదమూడు పార్టులున్న సీరియల్‌గా తీయాలనుందనే కోరికను వెలిబుచ్చాడు. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments