Education in AP: సీఎం వైయస్ జగన్ సంస్కరణల ఫలితం.. దేశంలోనే ఏపీ ఫస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ రాష్ట్రంలోనైనా పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతోంది. విద్యారంగం బాగుంటే ఆ రాష్ట్ర భవిష్యత్ కూడా కళకళలాడుతుంది. అందుకే సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యారంగం అభివృద్ధికి ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే విషయం జాతీయ స్థాయి నివేదికల్లోనూ నిరూపితమవుతోంది.
విద్య అందించడంలో అగ్రస్థానం..
తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ విడుదల చేసిన ఈ నివేదికలో ఫౌండేషన్ ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రమూ ఇందులో మాత్రం ఏపీ కన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఏపీనే ముందుంజలో ఉందని పేర్కొంది.
ఇతర రాష్ట్రాలకు దిక్సూచి..
అందుకే ఇతర రాష్ట్రాలు ఈ అంశంపై ఏపీ నుంచి నేర్చుకోవాలని స్పష్టంచేసింది. దీంతో పాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని వెల్లడించింది. ‘విద్య అందుబాటు’అంశంలో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత వంటి అంశాలను ఈ నివేదికలో విశ్లేషించింది.
జగన్ సంస్కరణలతోనే గుర్తింపు..
పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు ఎలా ఉన్నాయో పొందుపరిచింది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును రూపొందించింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదముందని వివరిస్తూనే ఇతర సూచలను అందించింది. మొత్తానికి విద్యా రంగంపై సీఎం జగన్ ఆలోచనా విధానం, అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రం పేరును ముందంజలో ఉండేలా చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout