కంచె వాయిదాకి కారణమేమిటో చెబుతాడట
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం కంచె. ఈ చిత్రాన్ని గమ్యం, వేదం, క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండవ ప్రపంచ యుద్దం నేపథ్యంతో కంచె చిత్రాన్ని క్రిష్ రూపొందించడంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 2న కంచె ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా కంచె వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కంచె హీరో వరుణ్ తేజ్ కన్ ఫర్మ్ చేసారు. ట్విట్టర్ లో వరుణ్ తేజ్ స్పందిస్తూ..కంచె రిలీజ్ డేట్ నవంబర్ 6 కి మారింది. కంచె వాయిదా వేయడానికి కారణం ఏమిటనేది త్వరలో చెబుతానన్నాడు. ఇంతకీ..వరుణ్ ఏం చెబుతాడో...చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com