'ఆఫీసర్'కి ఓ ప్ల‌స్ పాయింట్ ఏంటంటే..

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆఫీసర్'. వర్మ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబైలో ప‌తాక స‌న్నివేశాల‌కు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

వీటితో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా వుంటే.. ఈ చిత్రానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం మొత్తం నిడివి గం.1.40ని. (100 నిమిషాలు) మాత్రమే ఉంటుందని స‌మాచారం. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితమైన‌ స్క్రీన్ ప్లేతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను క్రిస్పిగా వర్మ మలిచారని చిత్ర వ‌ర్గాలు తెలియజేస్తున్నాయి.

అలాగే ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యే విధంగా సబ్జెక్టును తీర్చిదిద్దారని.. పాటలు పెడితే సబ్జెక్టు సైడ్ ట్రాక్ అవుతుందనే ఉద్దేశ్యంతో వాటి జోలికి వెళ్లలేదని కూడా ఇన్‌సైడ్ సోర్స్ టాక్. ఇక ఈ సినిమాలో నటించే మైరా సరీన్ కథానాయిక కాదని.. ఓ కీలక పాత్ర పోషిస్తోందని కూడా టాలీవుడ్ వ‌ర్గాల‌ సమాచారం. వేసవి సందర్భంగా మే 25న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

More News

మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

మంచు లక్ష్మి మరో తమిళ సినిమా చేయబోతోంది. మంచి కథలకే నా ఓటు అని ముందు నుంచీ చెబుతోన్న లక్ష్మి అందుకు తగ్గట్టే కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం 'వైఫ్ ఆఫ్ రామ్' అనే ఓ కొత్తతరహా కథతో రాబోతోన్న లక్ష్మికి మరో మంచి ఆఫర్ వచ్చింది.

చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు

బంధాలు,బాంధవ్యాల విలువల్ని చెప్తూనే,అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన చిత్రం 'మగధీరుడు'.

'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా(సూర్య 36)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

శర్వాకి చిరు సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చేనా?

ఇప్పటి తెలుగు హీరోలకి 90వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం పరిపాటైపోయింది.

'భరత్ అనే నేను' టీజర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో