'ఆఫీసర్'కి ఓ ప్లస్ పాయింట్ ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆఫీసర్'. వర్మ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబైలో పతాక సన్నివేశాలకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
వీటితో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా వుంటే.. ఈ చిత్రానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం మొత్తం నిడివి గం.1.40ని. (100 నిమిషాలు) మాత్రమే ఉంటుందని సమాచారం. ఆద్యంతం ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను క్రిస్పిగా వర్మ మలిచారని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి.
అలాగే ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యే విధంగా సబ్జెక్టును తీర్చిదిద్దారని.. పాటలు పెడితే సబ్జెక్టు సైడ్ ట్రాక్ అవుతుందనే ఉద్దేశ్యంతో వాటి జోలికి వెళ్లలేదని కూడా ఇన్‌సైడ్ సోర్స్ టాక్. ఇక ఈ సినిమాలో నటించే మైరా సరీన్ కథానాయిక కాదని.. ఓ కీలక పాత్ర పోషిస్తోందని కూడా టాలీవుడ్ వర్గాల సమాచారం. వేసవి సందర్భంగా మే 25న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com