ఛత్తీస్‌గఢ్ సీఎంను కొరడాతో కొట్టిన వృద్ధుడు.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేయి వేయాలంటే ఎంత గట్స్ ఉండాలి? అసలు సీఎం వరకూ ఓ సామాన్యుడు వెళ్లగలడా? కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా ఓ వృద్ధుడు కొరడాతో దండించాడు. ఎవరూ అడ్డుకోలేదు సరికదా.. వెంటనే కెమెరాలకు పని చెప్పారు. ఫోటోలు తీసే వారు తీస్తుండగా.. వీడియోలు తీసేవారు వీడియోలు తీస్తూ ఆనందిస్తున్నారు. ఇక ఆ రాష్ట్ర సీఎం మాత్రం నవ్వుతూ కొరడా దెబ్బలను తింటున్నారు. సీఎం సెక్యూరిటీ ఎవరూ కూడా ఆ పెద్దాయనను వారించలేదు.
అక్షరాలా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందిది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను కొరడాతో నిజంగానే దండించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినేంటి? కొరడాలతో కొట్టడమేంటి? అసలు సెక్యూరిటీ అంతా చోద్యం చూడమేంటి? జనాలు కెమెరాలకు పనిజెప్పడమేంటి? అది కూడా మన దేశంలో... అని ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి కదా.. ఎవరూ ఆపరు. సీఎం సెక్యూరిటీ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లదు. కారణం.. అది అక్కడి సంప్రదాయం. రాష్ట్రం సౌభాగ్యంతో తులతూగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వయానా ముఖ్యమంత్రి ఇలా కొరడా దెబ్బలు కొట్టించుకుంటారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇది అనాది నుంచి సంప్రదాయంగా వస్తోంది. దుర్గ్ జిల్లా, జజంగిర్ గ్రామంలో ప్రతి ఏటా గోవర్ధన్ పూజను వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పూజలో సీఎం భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన కూడా చేతిపై కొరడాతో దాదాపు పది వరకు కొట్టించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments