లంకలో బాంబులు పేల్చింది వీడే..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు వందలాది కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకూ 321 మంది ప్రజలు మరణించగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరు..? ఎందుకు దారుణానికి పాల్పడ్డారు..? అసలు ఈ దాడికి వెనుకున్న వ్యూహమేంటి..? ఈస్టర్ డే నాడే ఎందుకిలా చేశారు..? అని శ్రీలంక అధికారులు లోతుగా ఆరాతీయగా ఒళ్లు గగుర్పొడిచే విషయాలు, వీడియోలు వెలుగుచూశాయి. చర్చికి సమీపంలో, చర్చిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా ఈ దాడులకు తెగపడిందెవరో తేలింది.
వీడియోలో ఏముందంటే..
భారీగా వెయిట్ ఉన్న బ్యాగ్ మోసుకొని వస్తున్న ఓ కుర్రాడు ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియదు కానీ.. చర్చీలోకి ఎంటరై ముందు అందరూ అతడ్ని చూశారు. అందరిలాగే చర్చికి వచ్చాడేమో అని అనుకున్నారు కానీ.. వాడే వీళ్లందరి ప్రాణాలను తీసేవాడని పాపం ఊహించలేకపోయారు!. చర్చీలోకి వెళ్లే ముందు ఎంట్రెన్స్ దగ్గరున్న ఓ కుటుంబాన్ని పలకరించి మాట్లాడి.. చిన్నపాప తలనిమిరాడు. అనంతరం ఆ పాప తల్లిదండ్రులు అటుగా బయటికెళ్లగా.. ఈ కుర్రాడు చర్చిలోపలికి వెళ్లాడు. జనాల్లో ఒక్కడిగా కలిసిపోయి లోనికి ప్రవేశించి ఈ పేలుళ్లకు తెగబడినట్లుగా వీడియోను బట్టి చూస్తే అర్థమవుతోంది.
అసలేం జరిగిందో పూసగుచ్చినట్టుగా!
ఈ ఘటనకు సంబంధించి పెర్నాండో మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమాయకంగా ఉన్న ఆ వ్యక్తి తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి మనవరాలి తలను నిమిరాడని.. బరువైన బ్యాగుతో వచ్చిన వాడే ఈ పేలుళ్లకు పాల్పడ్డాడని చెబుతున్నారు. అయితే అప్పటికే ప్రార్థనలు పూర్తయ్యాయని.. ఆ టైమ్లో ఆ బ్యాగుతోనే వ్యక్తి ఎందుకు చర్చిలోపలికి వచ్చాడే తెలియలేదన్నారు.
అమాయకంగా ఉన్న ఆ వ్యక్తి ముఖంలో ఏ మాత్రం భయం, ఆత్రుత కనిపించలేదన్నారు. అయితే ఆ వ్యక్తి లోనికి వెళ్లిన కొద్ది సేపటికే ఒక్కసారిగా పేలుళ్లు జరిగాయని పెర్నాండో తెలిపారు. అయితే మా కుటుంబీకులంతా క్షేమంగా బయటపడ్డారని.. మా వాళ్లు చాలా మంది పేలుళ్లలో చనిపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల పిరికి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని.. వాళ్లను గెలవనీయం అంటూ పెర్నాండో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా.. ఈ వరుస బాంబు పేలుళ్లు మా పనేనని ఐసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com