Telangana Elections 2023: రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ముఖ్య నేతలు

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేటితో కీలక ఘట్టం ముగియనుంది. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే ఆఖరి రోజు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే రీతిలో పోరు జరుగుతోంది. హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రెండు, మూడు సీట్లు కూడా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల ఓట్లు చీలకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏర్పడింది. అందుకే రెబల్స్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థులను బుజ్జగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తు్న్నారు. చివరి నిమిషంలో టిక్కెట్ రాలేదన్న కోపంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో వారి చేత నామినేషన్లు ఉసంహరింపచేసేందుకు ప్రధాన పార్టీలన్నీ బుజ్జగింపులలో నిమగ్నమయ్యాయి.

119 నియోజకవర్గాల్లో దాఖలైన 4,798 నామినేషన్లలో 608 నామినేషన్లు తిరస్కరణకు గురవ్వగా 2,898మంది పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 మంది, మేడ్చల్‌లో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్భీనగర్‌లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక కొడంగల్‌లో 15మంది, నారాయణ పేటలో ఏడుగురు, బాల్కండలో తొమ్మిది మంది బరిలో ఉన్నారు. గజ్వేల్‌, కామారెడ్డిలలో ఎక్కువ మంది నామినేషన్లు వేయడం నష్టమనే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ పెద్దలు వారిని బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. నయానో, భయానో వారిని దారిలోకి తెచ్చి నామినేషన్లు విత్‌డ్రా చేసేలా పావులు కదుపుతున్నారు.

పెద్దపల్లిలో నల్ల మనోహర్‌రెడ్డి, స్వామి వివేక్ పటేల్.. మధిరలో బమ్మెర రాంమూర్తి, వైరాలో బడావత్ హరిబాబు, ములుగులో పొరిక సోమానాయక్‌లు బీఆర్ఎస్ రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. ఇక కాంగ్రెస్ రెబల్స్‌గా ఇల్లెందులో ఏకంగా ఆరుగురు పోటీలో ఉన్నారు. చొప్పదండిలో నాగశేఖర్‌, డోర్నకల్‌లో నెహ్రునాయక్‌, భూపాల్ నాయక్‌లు, పాలేరులో రామసహాయం మాధవి, నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్‌లు పోటీలో ఉన్నారు. పాలకుర్తిలో జంగా రాఘవరెడ్డి, సుధాకర్‌గౌడ్‌లు రెబల్‌గా పోటీలో ఉన్నారు. బోథ్‌లో వన్నెల అశోక్‌, నరేశ్ జాదవ్‌, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో కాసుల బాలరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్‌గా పోటీలో ఉన్నారు. అదిలాబాద్‌లో సంజీవ్‌రెడ్డి రెబల్‌గా, సూర్యాపేటలో పటేల్ రమేశ్‌రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే సహా పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బీజేపీలోనూ రెబల్ అభ్యర్థులు ఉన్నారు. అసిఫాబాద్‌లో కోత్నాక్ విజయ్‌కుమార్‌, పెద్దపల్లిలో గొట్టిముక్కల వివేక్‌రెడ్డి, బెల్లింపల్లిలో వెంకటకృష్ణ, చెన్నూరులో అందుగుల శ్రీనివాస్‌ నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డిలో రెబల్‌గా ఉన్న రాజేశ్వర్ దేశ్‌పాండేను, పటాన్ చెరులో శ్రీకాంత్‌, నర్సాపూర్‌లో గోపీలను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. మ‌రి అన్ని పార్టీల్లో ఎంత‌మంది నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకుంటారో బుధవారం సాయంత్రానికి తేలనుంది.

More News

Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. యానిమల్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగింది: నాదెండ్ల

జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

YS Jagan: సీఎం జగన్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల

కొందరు నాయకులు ప్రజలకు మంచి జరిగే పనులు మొదలుపెట్టారంటే.. పూర్తిచేసే దాకా విశ్రమించరు. అలాంటి పట్టువదలని నాయకుడిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

AP CID: టీడీపీ బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని సీఐడీ నోటీసులు

ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని తెలియజేస్తూ సీఐడీ కానిస్టేబుల్ ఒకరు కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు ఇచ్చారు.

బీజేపీలోకి మాజీ ఎంఐఎం నేత.. ఆహ్వానించిన కిషన్ రెడ్డి..?

తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని పార్టీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.