ప్రేయసి వెంటిలేటర్‌పై ఉండగానే తాళి కట్టాడు.. కానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కనీసం కుటుంబ సభ్యులంతా కలిసి కరోనా మృతులకు గౌరవప్రదంగా సాగనంపే పరిస్థితి లేదు. చాలా దయనీయం.. ఎంతో మంది తాము అత్యంత ప్రేమించని వారిని దూరం చేసుకుని కుమిలిపోతున్నారు. ఇలాంటి విషాద ఘటనే సంగారెడ్డిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి.. మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరివురి వివాహం జరగాల్సి ఉంది.
ఇద్దరూ కలిసి ఎంతో మంచి భవిష్యత్‌ను ఊహించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రేమికుడు నిత్యం ఆమెను చూసుకుంటూ ధైర్యం చెబుతూ వస్తున్నాడు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల అనుమతితో సదరు యువతి వద్దకు వెళ్లిన ఆమె ప్రియుడు ధైర్యంగా ఉండమని చెప్పడంతో పాటు ఆమెకు వెంటిలేటర్‌పై ఉండగానే మెడలో తాళి కట్టి మరింత భరోసానిచ్చాడు.
తానిచ్చిన భరోసాతో ఆమె క్షేమంగా.. ఆరోగ్యంగా వస్తుందని ఆశించాడు. కానీ ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవలే తుదిశ్వాస విడిచింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని గుండెలోనే అణచివేస్తూ ఆమె సోదరుడితో కలిసి ప్రియుడే అంత్యక్రియలు నిర్వహించాడు. ఆమె మరణించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. ఆమె ప్రేమికుడు మాత్రం గుండెల నిండా ఆమె జ్ఞాపకాలతో భారంగా కాలాన్ని వెళ్లదీస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments