లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి.. మోడీ, రాహుల్, ఎన్టీఆర్ సంతాపం
- IndiaGlitz, [Wednesday,July 07 2021]
లెజెండ్రీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరణించారు. గత నెలరోజుల్లో దిలీప్ కుమార్ ఆసుపత్రి పాలు కావడం ఇది రెండవసారి.
శ్వాస సంబంధిత సమస్యలు అధికం కావడంతో దిలీప్ కుమార్ చికిత్స పొందుతూ మరణించారు. గత నెలలో దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. పొలిటీషియన్ శరద్ పవార్ ఆ సమయంలో దిలీప్ కుమార్ ని ఆసుపత్రిలో పరామర్శించారు.
దిలీప్ కుమార్ ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు నమ్మవద్దు.. ఆయన బాగానే ఉన్నారు అంటూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన వచ్చింది. కాగా తాజాగా ఆయనకు శ్వాస సమస్యలు అధికం అయ్యాయి. దీనితో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించారు.
దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన నటించారు. మొఘల్ ఈ అజాం, రామ్ ఔర్ శ్యామ్, దేవదాస్, అందాజ్, గంగా జమున లాంటి అద్భుతమైన చిత్రాల్లో దిలీప్ నటించారు. 1998లో నటించిన క్విలా అనే చిత్రమే దిలీప్ కుమార్ చివరి మూవీ.
దిలీప్ కుమార్ 1966లో ప్రముఖ నటి సైరా భానుని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గోపి, సగినా, బైరాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. దిలీప్ కుమార్ ని భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులతో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దిలీప్ కుమార్ కు 'నిషాన్ ఈ ఇంతియాజ్ అవార్డు అందించడం విశేషం.
దిలీప్ కుమార్ మృతితో బాలీవుడ్ తో పాటు ఇండియన్ సినీ లోకమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు. దిలీప్ కుమార్ ఇండియన్ సినిమాకు అద్భుతమైన సేవలు అందించారు అంటూ జూ. ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడు.
Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP.
— Narendra Modi (@narendramodi) July 7, 2021
My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji.
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021
His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630
Dilip Kumar Saab's contribution to the growth of Indian cinema is priceless. Rest in Peace sir. You will be missed
— Jr NTR (@tarak9999) July 7, 2021