లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి.. మోడీ, రాహుల్, ఎన్టీఆర్ సంతాపం

లెజెండ్రీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరణించారు. గత నెలరోజుల్లో దిలీప్ కుమార్ ఆసుపత్రి పాలు కావడం ఇది రెండవసారి. 

శ్వాస సంబంధిత సమస్యలు అధికం కావడంతో దిలీప్ కుమార్ చికిత్స పొందుతూ మరణించారు. గత నెలలో దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. పొలిటీషియన్ శరద్ పవార్ ఆ సమయంలో దిలీప్ కుమార్ ని ఆసుపత్రిలో పరామర్శించారు. 

దిలీప్ కుమార్ ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు నమ్మవద్దు.. ఆయన బాగానే ఉన్నారు అంటూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన వచ్చింది. కాగా తాజాగా ఆయనకు శ్వాస సమస్యలు అధికం అయ్యాయి. దీనితో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించారు. 

దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన నటించారు. మొఘల్ ఈ అజాం, రామ్ ఔర్ శ్యామ్, దేవదాస్, అందాజ్, గంగా జమున లాంటి అద్భుతమైన చిత్రాల్లో దిలీప్ నటించారు. 1998లో నటించిన క్విలా అనే చిత్రమే దిలీప్ కుమార్ చివరి మూవీ. 

దిలీప్ కుమార్ 1966లో ప్రముఖ నటి సైరా భానుని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గోపి, సగినా, బైరాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. దిలీప్ కుమార్ ని భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులతో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దిలీప్ కుమార్ కు 'నిషాన్ ఈ ఇంతియాజ్ అవార్డు అందించడం విశేషం. 

దిలీప్ కుమార్ మృతితో బాలీవుడ్ తో పాటు ఇండియన్ సినీ లోకమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు. దిలీప్ కుమార్ ఇండియన్ సినిమాకు అద్భుతమైన సేవలు అందించారు అంటూ జూ. ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడు.

More News

హీరో సూర్యపై విమర్శల దాడి.. సీపీఎం, డివైఎఫ్ఐ మద్దతు!

నీట్ పరీక్షలు, సెన్సార్ చట్ట విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు స్టార్ హీరో సూర్య. నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని సూర్య అన్నారు.

వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది.. అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ముందుకు..

ప్రముఖ పీఆర్వో, నిర్మాత శ్రీనివాస్ కుమార్(ఎస్కెఎన్) జూలై 7న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు.

మంత్రి కేటీఆర్ ని కలిసిన సోనూసూద్.. ఆ ఇద్దరు దర్శకులు కూడా..

సోనూసూద్ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు. బడా సెలెబ్రిటీలు కూడా సోనూసూద్ అభిమానులుగా మారిపోతున్నారు.

ఇండియాలో ప్రభాస్, పృథ్విరాజ్.. వర్చువల్ ప్రొడక్షన్ విప్లవం మొదలు

ఫిల్మ్ మేకింగ్ అనేది స్థిరమైన ప్రక్రియ కాదు. కాలానుగుణంగా, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తుంటాయి.

శ్రీయ ప్రైవేట్ పార్ట్ పై ముద్దు పెట్టేసిన భర్త.. వీడియో వైరల్!

శ్రీయ శరన్, ఆమె భర్త ఆండ్రు కొశ్చివ్ రెక్కలున్న పక్షుల్లాగా ఎక్కడపడితే అక్కడకు వెకేషన్స్ కి వాలిపోతుంటారు.