Roja:మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ సామాజిక వర్గం నేతలు..

  • IndiaGlitz, [Wednesday,October 18 2023]

ఎప్పుడూ ఏదో వివాదంలో నిలిచే మంత్రి ఆర్కే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా రోజా మాట్లాడరంటూ కృష్ణా జిల్లాకు బుడబుక్కల సంఘం నాయకులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. తమ కులానికి రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎప్పటిలాగే విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి బుడబుక్కల సామాజిక వర్గం వారితో పోలుస్తూ విమర్శలు చేశారు.

సంక్రాంతికి బుడబుక్కల వాళ్లు వచ్చినట్లు.. పవన్ వస్తారు..

సంక్రాంతి పండుగ వస్తే గ్రామాల్లోకి బుడబుక్కల వాళ్లు వస్తుంటారని.. అలాగే పవన్ కల్యాణ్‌ కూడా బుడబుక్కల వాడని కేవలం టీడీపీ కోసం మాత్రమే పనిచేస్తుంటారని సెటైర్లు వేశారు. పవన్ ఒక బుడబుక్కల వాడు అయితే, చంద్రబాబు తనయుడు లోకేశ్ మరో బుడబుక్కల వాడు అంటూ వ్యాఖ్యానించారు. మైక్ కనిపిస్తే పిచ్చోళ్లా ఊగిపోతారంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల ముందు ఓ బుడబుక్కల వాడు(పవన్ కల్యాణ్‌) జగన్ రెడ్డిని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారని.. కానీ ఇప్పుడు వారి పార్టీ పరిస్థితి ఏంటో వారికే తెలియదన్నారు.

రోజా వ్యాఖ్యలపై బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం..

అయితే తమ సామాజిక వర్గంతో పవన్ కల్యాణ్‌ను పోలుస్తూ మంత్రి రోజా విమర్శలు చేయడంపై బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడరని.. తక్షణమే రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనను వ్యక్తిగతంగా ఘోరంగా అవమానించారంటూ రోజా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

More News

Telangana Janasena Leaders:తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే .. ఈసారి వెనక్కి తగ్గొద్దు : పవన్‌కు తేల్చిచెప్పిన టీ.జనసేన నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండు నెలల ముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించగా..

Bigg Boss 7 Telugu : హౌస్‌లో బూతు మాటలు, భోలేను ఆడుకున్న ప్రియాంక, శోభా.. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు

బిగ్‌బాస్ 7 తెలుగులో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. సోమవారం వాగ్వాదం, ఘర్షణలతో సమయం మించిపోవడంతో ఏడుగురు మాత్రమే నామినేషన్స్‌లో పాల్గొన్నారు.

Supreme Court:స్వలింగ సంపర్కుల వివాహాలు,  చట్టబద్ధత : సుప్రీంకోర్టు సంచలన తీర్పు .. సీజేఐ కీలక వ్యాఖ్యలు

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది.

Bigg Boss 7 Telugu : శివాజీ బయటికి ఎందుకెళ్లారంటే.. మళ్లీ ఏడ్చిన అశ్విని, విసిగించేస్తోన్న రైతు బిడ్డ

బిగ్‌బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ కావడంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు సహా హోస్ట్ నాగార్జున సైతం ఎమోషనల్ అయ్యారు.

Telangana TDP Candidates:తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై.. 87 స్థానాల్లో అభ్యర్థులు రెడీ..

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తామని ప్రకటించారు.