Roja:మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ సామాజిక వర్గం నేతలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడూ ఏదో వివాదంలో నిలిచే మంత్రి ఆర్కే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా రోజా మాట్లాడరంటూ కృష్ణా జిల్లాకు బుడబుక్కల సంఘం నాయకులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. తమ కులానికి రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎప్పటిలాగే విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి బుడబుక్కల సామాజిక వర్గం వారితో పోలుస్తూ విమర్శలు చేశారు.
సంక్రాంతికి బుడబుక్కల వాళ్లు వచ్చినట్లు.. పవన్ వస్తారు..
సంక్రాంతి పండుగ వస్తే గ్రామాల్లోకి బుడబుక్కల వాళ్లు వస్తుంటారని.. అలాగే పవన్ కల్యాణ్ కూడా బుడబుక్కల వాడని కేవలం టీడీపీ కోసం మాత్రమే పనిచేస్తుంటారని సెటైర్లు వేశారు. పవన్ ఒక బుడబుక్కల వాడు అయితే, చంద్రబాబు తనయుడు లోకేశ్ మరో బుడబుక్కల వాడు అంటూ వ్యాఖ్యానించారు. మైక్ కనిపిస్తే పిచ్చోళ్లా ఊగిపోతారంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల ముందు ఓ బుడబుక్కల వాడు(పవన్ కల్యాణ్) జగన్ రెడ్డిని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారని.. కానీ ఇప్పుడు వారి పార్టీ పరిస్థితి ఏంటో వారికే తెలియదన్నారు.
రోజా వ్యాఖ్యలపై బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం..
అయితే తమ సామాజిక వర్గంతో పవన్ కల్యాణ్‌ను పోలుస్తూ మంత్రి రోజా విమర్శలు చేయడంపై బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడరని.. తక్షణమే రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనను వ్యక్తిగతంగా ఘోరంగా అవమానించారంటూ రోజా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com