యూత్‌కి షాకిస్తున్న కరోనా తాజా అధ్యయనాలు
- IndiaGlitz, [Tuesday,July 14 2020]
కరోనాపై రోజురోజుకూ వెలువడుతున్న అధ్యయనాలు ఒక్కొక్క అపోహనూ కొట్టి పారేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశముందంటూ షాక్ ఇవ్వగా.. ఇప్పుడు మరో నూతన విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకూ కరోనా ముప్పు వృద్ధులకు, ఇతరత్రా ఏమైనా అనారోగ్య సమస్యలున్న వారికి మాత్రమేనని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. యువతకు మాత్రం కరోనా నుంచి ముప్పేమీ లేదని తెలిపాయి. తాజా అధ్యయనాలు మాత్రం యూత్‌కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
కరోనా వైరస్ కారణంగా యువతకు పెద్ద ప్రమాదమేమీ లేదన్న వార్తలను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు కొట్టి పారేశారు. ప్రతి ముగ్గురు అమెరికన్ యువకుల్లో కరోనా కారణంగా ఒకరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశముందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. గుండెజబ్బులు, డయాబెటివ్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి చాలా ప్రమాదకరమని.. వీరితో పాటు పొగ తాగేవారు సైతం కరోనా బారిన పడితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.