Sudipto Sen:'ది కేరళ స్టోరీ' దర్శకుడు , హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలరం రేపిన సినిమా ‘‘ ది కేరళ స్టోరీ’’. లవ్ జిహాద్ పేరిట హిందూ, క్రిస్టియన్ యువతలను ట్రాప్ చేసి వారిని ఇస్లాంలోకి మార్చి ఆపై ఉగ్రవాదంలోకి దించుతున్నారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. అయితే ది కేరళ స్టోరీని థియేటర్‌లలోకి రాకుండా అడ్డుకునేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. అంతేకాదు.. చివరికి కొందరు కోర్టు మెట్లెక్కారు కూడా. అయినప్పటికీ సినిమాను మాత్రం అడ్డుకోలేకపోయారు. కొన్ని చోట్ల బ్యాన్ చేసినా.. ఇంకొన్ని చోట్ల ఆంక్షలు విధించినా కేరళ స్టోరీ మాత్రం దుమ్మరేపుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా అప్పుడే వంద కోట్ల మార్కు చేరుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర యూనిట్ స్క్రీన్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రమాదం కారణంగా హిందూ ఏక్తా యాత్రకు దూరం :
ఇదిలావుండగా.. ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదాశర్మలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన సుదీప్తో సేన్, ఆదాశర్మలను ఆసుపత్రికి తరలించారు. ఈరోజు కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘హిందూ ఏక్తా యాత్ర’’కు ది కేరళ స్టోరీ మూవీ యూనిట్ హాజరుకావాల్సి వుంది. అయితే తమకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాలేమని సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు.
ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆదా శర్మ:
ఇకపోతే.. తమ చిత్రానికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు ఆదా శర్మ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. తమ నిజాయితీని కొందరు అపహాస్యం చేశారని.. తమ చిత్తశుద్ధిని చులకన చేసి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టీజర్ వచ్చార .. కేరళ స్టోరీని రిలీజ్ చేయొద్దని బెదిరింపులు కూడా వచ్చాయని.. కొన్ని చిత్రాలు సినిమాను బ్యాన్ చేశాయని ఆదా శర్మ గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని.. అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj
— Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout