Pallavi Joshi: షూటింగ్‌లో ప్రమాదం, ది కాశ్మీర్ ఫైల్స్ నటి పల్లవి జోషికి గాయాలు .. రక్తం కారుతున్నా షాట్ పూర్తి చేసి
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషి షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..ది కాశ్మీర్ ఫైల్స్‌తో సంచలనం సృష్టించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘‘ ది వాక్సిన్ వార్’’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సెట్‌లో వున్న ఓ వాహన అదుపుతప్పి ఢీకొనడంతో పల్లవి జోషికి గాయాలయ్యాయి. అయినప్పటికీ గాయాలతోనే తన షాట్‌ను పూర్తి చేశారు పల్లవి. అనంతరం ఆమెను చిత్ర యూనిట్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పల్లవి జోషి ఆరోగ్యం నిలకడగానే వుందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని యిత్ర యూనిట్ తెలిపింది.
ది కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న పల్లవి జోషి:
ఇకపోతే.. సినిమాలు , సీరియల్స్ ద్వారా పల్లవి జోషి దేశ ప్రజలకు సుపరిచితురాలే. ఇక గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ఆమె పేరు మరింత మారుమోగిపోయింది. ఇక ప్రస్తుత ది వ్యాక్సిన్ వార్‌లో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్యసేథ్, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను 2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ సహా మొత్తం పది భారతీయ భాషల్లో ది వ్యాక్సిన్ వార్‌ను విడుదల చేయనున్నారని సమాచారం.
ఈ నెల ప్రారంభంలో షూటింగ్‌లో గాయపడ్డా రోహిత్ శెట్టి:
ఇదిలావుండగా.. ఈ నెల ప్రారంభంలో బాలీవుడ్ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి సైతం హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా , శిల్పా శెట్టి , ఇషా తల్వార్, విభూతి తల్వార్, నికితిన్ ధీర్, శ్వేతా తివారిలు నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com