మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న హారర్ కామెడీ 'వస్తా'
Send us your feedback to audioarticles@vaarta.com
భానుచందర్, జీవా, అదిరే అది, ఫణి ప్రధాన తారాగణంగా మెట్రో క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతోన్న సినిమా 'వస్తా'. జంగాల నాగబాబు దర్శకుడు. దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మాతలు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...
నిర్మాతలు మాట్లాడుతూ - "ప్రస్తుతం టాలీవుడ్లో హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి. వీటి ఇన్స్పిరేషన్తో ప్రస్తుతం మా నిర్మాణసంస్థలో వస్తా అనే సినిమా చేస్తున్నాం. జంగాల నాగబాబుగారు చెప్పిన కథతో భిన్నంగా ఉండటంతో సినిమా నిర్మాణానికి సిద్ధమైయ్యాం. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరో, నటుడు భానుచందర్‌గారు సహకారం మరువలేనిది. సినిమాలో ఆయన ఒక కీలకపాత్రలో మెప్పిస్తారు. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమాను తీస్తాం" అన్నారు.
భానుచందర్, జీవా, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, ఫణి, రఘువర్మ, పిల్లా నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక, జ్యోతిర్మయి, పుట్టి నాగేంద్ర, సొంఠి సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
పాటలుః ఆనంత్ శ్రీరామ్, సినిమాటోగ్రఫీః వాసి రెడ్డి సత్యానంద్, నిర్మాతలుః దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్, దర్శకత్వంః జంగాల నాగబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments