ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుట పడింది: నమ్రతా శిరోద్కర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాను ఆదర్శంగా తీసుకుని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్‌తో కలిసి మహేష్ ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్ చేయించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు గుండెలు తమ కుటుంబంలో కలిశాయని నమ్రత తెలిపారు. "మరో రెండు గుండెలు మా కుటుంబానికి తోడయ్యాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు" అని నమ్రత పోస్ట్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com