మహా సంక్షోభంపై విచారణ వాయిదా... గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం
- IndiaGlitz, [Sunday,November 24 2019]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన, ఎన్పీపీ, కాంగ్రెస్ తరపున వాదనలు విన్నజస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఉదయం 10:30 గంటలకు మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ అంశంపై కేంద్రం,
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వాన పత్రం, బీజేపీకి మద్ధతు తెలుపుతూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేసిన సంతకాల పత్రాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ ను కోరింది. ఆ తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.