BJP:బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణ నుంచి బరిలో ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 195 అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే విడుదల చేశారు. 370 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలో మొత్తం 16 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పారు.
ఇందులో ఉత్తరప్రదేశ్-51, మధ్యప్రదేశ్-24, పశ్చిమబెంగాల్ - 27, మధ్యప్రదేశ్- 24, గుజరాత్- 15, రాజస్థాన్ -15, కేరళ-12, తెలంగాణ-9, ఝార్ఖండ్-11, ఛత్తీస్గడ్-12, దిల్లీ-5, జమ్మూకశ్మీర్-2, ఉత్తరాఖండ్-3, అరుణాచల్ ప్రదేశ్-2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్, దమన్ అండ్ దీవ్ నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నట్లు తెలిపారు. తొలి జాబితాలో 34 మంత్రులు, ఇద్దరు సీఎంలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఇక 28 మంది మహిళలు, 47 మంది యువతకు ఛాన్స్ ఇవ్వగా.. 27 మంది ఎస్సీ, 17 ఎస్టీ, 57 మంది ఓబీసీలకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ వరుసగా మూడో సారి కూడా వారణాసి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంంత్రి అమిత్ షా, లక్నో నుంచి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయనున్నారు. విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బరిలో దిగనున్నారు. యూపీలోని అమేథీ స్థానం నుంచి స్మృతీ ఇరానీ మరోసారి బరిలో దిగారు. కేరళలోని త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి సినీ నటుడు సురేశ్ గోపి, తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు అవకాశం దక్కింది.
ఇక తెలంగాణలో 9 మంది అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ బరిలో బీబీ పటిల్, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్.. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, హైదరాబాద్ బరిలో మాధవీలత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments