ఈ ఏడాది ప్రథమార్థం అందుకే స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ప్రథమార్థం తెలుగు సినిమా అభిమానులకు ఒక రకంగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతి నెల కూడా పెద్ద హీరోల సినిమాలతో సందడిగా ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. జనవరి నెలలో ఇప్పటికే నటసింహా నందమూరి బాలకృష్ణ (జై సింహా), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ (అతిథి పాత్ర) (అజ్ఞాతవాసి) సినిమాలతో సందడి చేశారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో మాస్ మహారాజా రవితేజ (టచ్ చేసి చూడు) పలకరించారు.
ఇక ఈ మార్చి నెలాఖరులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (రంగస్థలం) సందడి చేయనున్నారు. అలాగే ఏప్రిల్ విషయానికి వస్తే.. మహేష్ బాబు తన కొత్త చిత్రం 'భరత్ అనే నేను'తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మే నెల విషయానికి వస్తే.. 'ఆఫీసర్'తో నాగార్జున.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంతో అల్లు అర్జున్ అభిమానుల ముందుకు రానున్నారు. ఇక ఇదే మే నెలలో గానీ లేదా జూన్ నెలలోగానీ రవితేజ కొత్త చిత్ర 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న పేరు) విడుదల కావచ్చు. అంటే.. ఆరు నెలల పాటు అగ్ర తారల సినిమాలతో ఈ ఏడాది ప్రథమార్థం సందడిగా ఉండనుందన్నమాట. ద్వితీయార్థంలో మాత్రం ఈ స్థాయి వినోదానికి చాన్స్ తక్కువే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout