Congress:కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్న తుది జాబితా లిస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న సీట్లను పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఐదు స్థానాలతో తుది జాబితా ప్రకటించింది. అయితే ఈ జాబితా అసంతృప్తులకు కారణమవుతోంది. పటాన్ చెరు, సూర్యాపేట, తుంగతుర్తి టికెట్లపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐదు స్థానాల అభ్యర్థులు..
చార్మినార్- ముజీబ్ షరీఫ్
తుంగతుర్రి (ఎస్సీ)- మందుల శామ్యూల్
పటాన్ చెరు- కట్టా శ్రీనివాస్ గౌడ్
మిర్యాల గూడ - బాతుల లక్ష్మారెడ్డి
సూర్యాపేట - రామిరెడ్డి దామోదర్ రెడ్డి
ఇందులో ముందుగా పటాన్ చెరు అభ్యర్థిగా నీలం మధును ఎంపిక చేయడంతో శ్రీనివాస్ గౌడ్ వర్గీయలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అలాగే గాంధీభవన్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ కేటాయించారు. అలాగే సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ ఆశించగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దాంతో రమేశ్ రెడ్డి కంటతడి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక తుంగతుర్తి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అద్దంకి దయాకర్‌కు అధిష్టానం మొండిచేయి చూపించింది. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దయాకర్‌ను కాదని మందుల శామ్మూల్కు టికెట్ కేటాయించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments