BiggBoss: టాప్ నుంచి లాస్ట్‌కి పడిపోయిన ఆదిరెడ్డి... శ్రీహాన్- రేవంత్‌ల మధ్య ఫైనల్

  • IndiaGlitz, [Saturday,December 03 2022]

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనున్నాడు. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌ని ఫైనల్‌కి చేర్చే టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన గేమ్స్‌లో ఆదిరెడ్డి 13 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మాత్రమే టికెట్ టు ఫినాలే రేసులో పోటీపడుతున్నారు. అయితే వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే నెక్ట్స్ రౌండ్‌కి పోటీపడాలని.. ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇది మరోసారి ఇంట్లో గొడవలకు కారణమైంది.

పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న ఫైమా, రోహిత్‌లు నిలవడంతో వారిద్దరూ తప్పుకున్నారు. చివరికి రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లు పోటీపడ్డారు. వీరికి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో రేవంత్, శ్రీహాన్‌లు బాగా ఆడటంతో.. ఇప్పటి వరకు టాప్‌లో నిలిచిన ఆదిరెడ్డి మూడో స్థానంలో నిలిచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో రేవంత్, శ్రీహాన్‌లు టాప్ 2లో నిలిచారు. ఈ టాస్క్ ముగిసేసరికి రేవంత్‌కి 15, శ్రీహాన్ 14, ఆదిరెడ్డికి 14 పాయింట్లు వచ్చాయి. తదుపరి రౌండ్‌లో శ్రీహాన్, ఆదిరెడ్డిలలో ఒకరే రేవంత్‌తో పోటీపడాలని చెప్పారు బిగ్‌బాస్.

ఎవరు పోటీపడాలో తేల్చేందుకు గాను శ్రీహాన్, ఆదిరెడ్డికి మధ్య పోటీపెట్టారు. పరుగులు తీస్తూ బెలూన్లు ఊది వాటిని పగులగొట్టాలి. శ్రీహాన్ బెలూన్‌లను వేగంగా ఊదేసి టపాటపా పగులగొట్టేశాడు. ఇదంతా ఆదిరెడ్డి వల్లకాకపోవడంతో చతికిలపడ్డాడు. దీంతో అతను చాలా ఫీల్ అయ్యాడు. శ్రీహాన్‌తో టై అయినప్పుడు వేరే టాస్క్ ఇవ్వాలి కానీ.. నేను ఓడిపోవడానికి కారణమైన టాస్క్‌నే ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. ఏది ఏమైనప్పటికీ టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శ్రీహాన్, రేవంత్‌ల మధ్య జరగనుంది. మరి వీరిద్దరిలో ఎవరు ముందుగా ఫైనల్‌లో అడుగుపెడతారో చూడాలి. మరోవైపు ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, రోహిత్, శ్రీసత్యలు నామినేషన్స్‌లో వున్నారు. మరి వీరిలో ఎవరు హౌస్‌ను వీడతారో చూడాలి.

ఇకపోతే... ఈరోజు చెప్పుకోవాల్సింది రోహిత్ - ఇనయాల డిస్కషన్‌ల గురించే . సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయే రోహిత్ సంచాలక్‌గా వున్న ఇనయాతో గొడవకు దిగాడు. టికెట్ టు ఫినాలే నెక్ట్స్‌ రౌండ్ కోసం రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్‌లలో ముగ్గురిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో రోహిత్ ఎప్పటిలాగే ... టాప్ పొజిషన్‌లో వున్న వాళ్లను తీసేసి చివరిలో వున్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయొద్దని చెప్పి టాస్క్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. మధ్యలో ఇనయా కలగజేసుకుని అంటే గేమ్ ఆడనని అంటున్నావా అని అడిగింది. దీనికి శ్రీహాన్ ఫైరయ్యాడు. టాస్క్‌ ఆడనని తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావని ఇనయాను ప్రశ్నించాడు.

రోహిత్ ఆడటం లేదు కాబట్టి ఫైమాని కూడా తొలగించాల్సి వస్తుందని ఇనయా చెప్పడంతో.. రోహిత్‌కి కోపం వచ్చింది. తన వల్ల ఫైమాను తీసేయడం ఏంటీ.. నీది చెత్త నిర్ణయం.. కాస్త బుర్రవాడాలంటూ గొడవకు దిగాడు. దీనికి ఇనయా కూడా గట్టిగానే బదులిచ్చింది. నువ్వు సిల్లీగా బిహేవ్ చేస్తున్నావంటూ మండిపడింది. దీంతో రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చింది. బిహేవియర్ గురించి నువ్వు మాట్లాడకు అంటూ కళ్లు ఇంత పెద్దవి చేస్తూ ఇనయా మీదకు వెళ్లాడు. మొత్తంగా నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల మధ్య ఈ రోజు గొడవ జరిగింది. సంచాలక్‌గా మేం నిర్ణయం తీసుకుంటామని అమ్మాయిలు అంటే.. అలా ఎలా తీసుకుంటారని ఇద్దరూ కలిసి హౌస్‌ని హోరెత్తించారు.