'నేనే అందరినీ చంపుతా'.. వామ్మో.. సమంత యాక్షన్ చూశారా!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ' ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. మనోజ్ భాజ్ పాయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది.
ట్రైలర్ లో విశేషాలు గమనిస్తే.. మనోజ్ భాజ్ పాయి,ప్రియమణి భార్య భర్తలుగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య రిలేషన్ సరిగా ఉండదు. అలాగే మనోజ్ తన జాబ్ పై కూడా ద్రుష్టి పెట్టలేకుండా ఉంటాడు. ఈ అంశాలని కొంచం ఫన్నీగా చూపించారు.
ఇలాంటి సమయంలో చెన్నైలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. మనోజ్ కు తన స్నేహితుడు జికె నుంచి ఫోన్ వస్తుంది. దీనితో మనోజ్ చెన్నైకి వెళతాడు. అప్పుడే సమంత పాత్రని ట్రైలర్ లో చూపించారు. సమంత ఐఎస్ఐ నుంచి వచ్చే కిల్లర్ లేడీగా కనిపిస్తోంది. మతి పోగొట్టే విధంగా సమంత యాక్షన్ ఎపిసోడ్స్ నటించింది.' నేనే అందరినీ చంపుతా' అంటూ సమంత చెప్పే డైలాగ్ కూడా ఆసక్తిని పెంచే విధంగా ఉంది.
ఓవరాల్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ అద్భుతంగా ఉంది. నటీనటుల పెర్ఫామెన్స్, బ్యాగ్రౌండ్ సంగీతం బావున్నాయి. సమంత తొలిసారి వెబ్ సిరీస్ లో నటిస్తోంది కాబట్టి సౌత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ని ఉద్దేశిస్తూ నాగ చైతన్య ' చాలా బాగా నచ్చింది 10/10' అని కామెంట్ పెట్టాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments