'ది ఐస్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
అవయవాల మార్పిడిపైన మనకు వచ్చిన సినిమాలు తక్కువే. వచ్చిన వాటిలోనూ కళ్ళ మీద వచ్చిన సినిమాలే ఎక్కువ. తాజాగా మీరాజాస్మిన్ నటించిన ది ఐస్` కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా మలయాళ చిత్రం మిస్ లేఖా థరూర్ కానున్నదు` అనే తమిళ సినిమాకు అనువాదం. మరి ఈ సినిమాలో కళ్ళ మార్పిడి అనే విషయాన్ని కొత్తగా ఎలా నెరేట్ చేశారు? అనేది ఆసక్తికరం.
కథ
లేఖ (మీరాజాస్మిన్) ఓ పాపులర్ టీవీ షోకు హోస్ట్. ఆమె కాన్సెప్టులకు ప్రేక్షకుల్లో అమితమైన క్రేజ్ ఉంటుంది. తన నాలుగేళ్ళ ప్రాయంలో ఓ దీపావళికి చిచ్చుబుడ్డి కాలుస్తూ కళ్ళు పోగొట్టుకుంటుంది. చిచ్చుబుడ్డిని వెలిగించి ఇచ్చింది లేఖ అక్క. తన వల్లే లేఖకు చూపు పోయిందని బాధపడుతుంటుంది లేఖ సోదరి. కానీ తనకు కళ్ళు లేవనే బాధ ఎప్పుడూ లేదని చెబుతుంది లేఖ. పాతికేళ్ళ వయసులో లేఖకు సరిపోయే కళ్ళు దొరకడంతో ఆపరేషన్ చేస్తారు. శస్త్ర చికిత్స తర్వాత లేఖకు మందంగా చూపొస్తుంది. కానీ ఆ కనిపించడం కూడా మామూలు మనుషులతో పాటు, చనిపోయినవారు కూడా కనిపిస్తుంటారు. క్రమేణ తనకు కనిపిస్తున్నది చనిపోయినవారు అని తెలుసుకున్న లేఖ తనకు కళ్ళు దానం చేసిన వారిగురించి తెలుసుకోవాలనుకుంటుంది. తీవ్రంగా పోరాడి ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. లేఖకు కళ్ళు దానం చేసిన వ్యక్తి పేరు మీన. మీన కళ్ళకు భవిష్యత్తును తెలుసుకునే పవర్ ఉంటుంది. అయితే మీన కళ్ళు లేఖకు ఎందుకు అమర్చారు? అసలు మీనకు ఏమైంది? మీన తనకళ్ళ ద్వారా లేఖకు ఏమైనా చెప్పాలనుకుందా? చెప్పిందా? చివరికి లేఖకు అమర్చిన లేఖ కళ్ళకు ఏమైంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉంటాయి సినిమాలో.
ప్లస్ పాయింట్లు
మీరాజాస్మిన్ చాలా సహజంగా నటించింది. ఆమె నటనే ప్లస్ పాయింట్. మేకప్ డిపార్టు మెంట్ కు కూడా తప్పకుండా అభినందనలు చెప్పాల్సిందే. మీరాజాస్మిన్ కి చూపులేనప్పుడు బ్లాక్ గ్లాస్ వెనుక ఉన్న కళ్ళను చూడగానే సినిమా మూడ్ లోకి తీసుకెళ్తాయి. మీనా పక్కనున్న ముసలావిడ లుక్ ను చాలా బాగాడిజైన్ చేశారు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ నూ మెచ్చుకోవాలి. వెన్నెలకంటి డైలాగులు కూల్ గా ఉంటాయి. అయితే నేపథ్య సంగీతం మాత్రం హాట్ గా ఉంటుంది. ఆ శబ్దాలు ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోనివ్వవు. భయానకంగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తుంటాయి. కెమెరా పర్ఫెక్ట్. లొకేషన్లు కూడా బావున్నాయి.
మైనస్ పాయింట్లు
పాటలు పెద్ద బాగా లేవు. ఉన్న పాట కూడా అనవసరం అనే అనిపిస్తుంది. ఈ సినిమాలోని నటీనటులు మనకు ఎవరూ తెలియదు. సో సినిమా చూస్తున్నంత సేపు మీరా జాస్మిన్ వన్ ఉమెన్ షోను చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మీనా ఎపిసోడ్ పెద్ద గ్రిప్పింగ్ గా అనిపించదు. పెద్దగా మైనస్ పాయింట్లు అంటూ సినిమాలో ఏమీ కనిపించవు.
విశ్లేషణ
ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలను బట్టి ప్రేక్షకుడు రకరకాల ఊహల్లో ఉంటాడు. కానీ వాటన్నిటికీ అతీతంగా సెకండాఫ్ లో సినిమా సాగుతుంది. మీనా గురించి బిల్డప్ బాగానే ఉంటుంది. కానీ ఆమె కథలో మాత్రం ఇంటెన్సిటీ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. మీనా ఇంటికి వెళ్ళొచ్చాక మీరాజాస్మిన్ ఏం అర్థం చేసుకుందన్న విషయం ప్రేక్షకుడికి అర్థం కాదు. సంగీత దర్శకుడికి మాత్రం ఈ తరహా సినిమాల ఆఫర్లు కోకొల్లలుగా వస్తాయన్నది ఖాయం.
బాటమ్ లైన్: సౌండ్ తో భయపెట్టే థ్రిల్లర్.. ది ఐస్
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com