టీచర్ పాఠం చెబుతుండగా.. క్లాస్ రూంలోకి సడెన్‌గా వచ్చిన ఏనుగు..
- IndiaGlitz, [Monday,July 06 2020]
టీచర్ ఏనుగు గురించిన పాఠం చెబుతోంది. ఆమె వన్.. టు.. త్రి అనగానే క్లాస్ రూంలోకి ఏనుగు వచ్చి చిన్నారుల ముందు నిలబడింది. పిల్లలంతా షాక్ అయ్యారు. ఇది కేరళలోని ఓ పాఠశాలలో జరిగింది. అయితే ఏనుగు నిజం కాదులెండి. కేరళ మలప్పురంలోని ‘ది మూర్ఖనాడ్ ఏఈఎమ్ఏయూపీ’ స్కూలు ఆగ్‌మెంటెడ్ రియాలిటీని అవలంబిస్తోంది. వర్చువల్ క్లాసుల్లో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇలా ఒక్క క్లాసులోనే కాదు.. 6వ తరగతి రూమ్‌లోకి ఆవు.. ఐదవ తరగతి రూమ్‌లోకి ఆర్టిఫిషియల్ సోలార్ సిస్టమ్ వచ్చి చేరాయి. ఈ సరికొత్త విధానం వెనుకు ఉన్నది శ్యామ్ అనే ఓ టీచర్. స్పీకర్ శివరామకృష్ణ, సినిమా దర్శకుడు లాల్ జోష్ ఈ విధానాన్ని ప్రశంసించారు.