Telangana Elections:తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలు..

  • IndiaGlitz, [Thursday,December 07 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిందో రాష్ట్రంలో మరో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ప్రస్తుతం సర్పంచ్, వార్డు మెంబర్‌ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగుస్తుంది. దీంతో 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో ఈసీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.

ఈనెల 30లోపు రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతి వార్డులో ఓ పోలింగ్ కేంద్రం పెట్టాలన్నారు.
తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీకాలం ఐదేళ్లు కాగా.. ఆ గడువు ముగుస్తుండడంతో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలు కానుంది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో తెలంగాణలో ఆరు నెలల పాటు ఎన్నికల హడావిడి ఉండనుంది. ఎందుకంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. అవి అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ లేదా మేలో పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు ఎన్నికల కోలహలామే కనిపించనుంది. ఇప్పటికే గత రెండు నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల జాతర జరిగిన సంగతి తెలిసిందే.

More News

Revanth Reddy:సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చే తొలి ఉద్యోగం ఎవరికో తెలుసా..?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి.. తొలి ఉద్యోగం ఎవరికి ఇవ్వనున్నారో తెలుసా.

Revanth Reddy:తెలంగాణ సీఎంగా రేపే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో

CM Jagan:ప్రజలు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం తరపున ఆదుకుంటాం: సీఎం జగన్

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Bigg Boss Telugu 7 : యావర్‌కు ఛాన్స్ మిస్, శోభను వరించిన అదృష్టం .. సీరియల్ బ్యాచ్ మధ్య మళ్లీ గొడవలు

బిగ్‌బాస్ సీజన్ 7లో చివరి నామినేషన్స్ సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి తప్పించి మిగిలిన శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, అమర్‌దీప్,

Hero Flood: వరద నీటిలో ఇరుక్కుపోయిన హీరో.. సాయం కోసం ఎదురుచూపులు..

మిజాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికపోయింది.