Telangana Elections:తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిందో రాష్ట్రంలో మరో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ప్రస్తుతం సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగుస్తుంది. దీంతో 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో ఈసీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
ఈనెల 30లోపు రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతి వార్డులో ఓ పోలింగ్ కేంద్రం పెట్టాలన్నారు.
తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీకాలం ఐదేళ్లు కాగా.. ఆ గడువు ముగుస్తుండడంతో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలు కానుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో తెలంగాణలో ఆరు నెలల పాటు ఎన్నికల హడావిడి ఉండనుంది. ఎందుకంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. అవి అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ లేదా మేలో పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు ఎన్నికల కోలహలామే కనిపించనుంది. ఇప్పటికే గత రెండు నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల జాతర జరిగిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments