హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే...
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడలో కిర్రిక్ పార్టీతో సక్సెస్ కొట్టిన రష్మిక మందన్నా.. తెలుగులో నాగశౌర్య 'ఛలో'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్‌హిట్ అయ్యింది. దీంతో రష్మికకు వరుస అవకాశాలు వచ్చాయి. విజయ్‌దేవరకొండతో రష్మిక నటించిన 'గీతగోవిందం' తిరుగులేని హిట్ సాధించి రష్మికకు మరింత పేరును తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం నాగార్జున, నానిలతో రష్మిక నటించిన 'దేవదాస్' ఈ నెల 27న విడుదలవుతుంది. అలాగే విజయ్ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తుంది. అయితే రష్మికకు తెలుగులో 'ఛలో'తో సక్సెస్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల.
ఈయన ఇప్పుడు నితిన్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట డైరెక్టర్ వెంకీ కుడుముల. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com