రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లు ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతి వెయిట్ చేయాల్సి వచ్చింది 'ఆర్.ఎక్స్ 100' తర్వాత 'మహా సముద్రం' అనే మల్టీస్టారర్ కథను సిద్ధం చేసుకున్నాడు. రవితేజ సహా పలువురు హీరోలను కలిశాడు. అంతా ఓకే అవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వచ్చింది. చివరకు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి ఇందులో మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంది. 8 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ నటిస్తోన్న తెలుగు చిత్రమిది. ఇన్టెన్స్ లవ్‌స్టోరి అని తెలియజేసేలా ఇది వరకే పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ స్టార్ట్ చేశామనే సంగతిని యూనిట్ రివీల్ చేయలేదు. అయితే గోవాలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com