The Birthday Boy:'ది బ‌ర్త్‌డే బాయ్' టైటిల్ గ్లింప్స్ విడుద‌ల

  • IndiaGlitz, [Friday,June 07 2024]

ఇప్పుడు రొటిన్ క‌థ‌ల‌కు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫ‌న్ని సంభాష‌ణ‌తో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రారంభ‌మై చిత్రంలో పాత్ర‌ల‌ను ప‌రిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది.

ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భ‌ర‌త్‌, డీఓపీ : సంకీర్త్ రాహుల్‌, సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌: సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌: వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

More News

8 Vasanthalu:అనంతిక సనీల్‌కుమార్‌ '8 వసంతాలు'

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే

Matka:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  జూన్ 19 నుంచి 'మట్కా' షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో

Prandeep Thakore:‘రక్షణ’ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రియలిస్టిక్ అప్రోచ్‌తో తీశాను..  దర్శక నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది.

Bharateeyudu 2:సుభాస్కరన్ గారు పెట్టుకున్న నమ్మకమే ఈ చిత్రం.. ‘భారతీయుడు 2’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో

Sathya Raj:కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతోంది.. ‘వెపన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సత్య రాజ్

మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’.