మానవత్వం ఇంకా ఉందనే నమ్మకం రెట్టిపైంది: చిన్మయి
Send us your feedback to audioarticles@vaarta.com
మీటూ ఉద్యమాన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీలో లీడ్ చేసిన సింగర్ చిన్మయి.. లాక్‌డౌన్ సమయంలో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆరు నెలల సమయంలో మూడు వేల వీడియోలు రికార్డు చేశారు. అంతే కాదండోయ్.. వీటిని శ్రోతలకు షేర్ చేసి రూ.85 లక్షల విరాళాలను సేకరించారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే, ఈ విరాళాలను చిన్మయి అవసరంలో ఉన్న వారి ఖాతాల్లోకే వెళ్లే విధంగా ప్లాన్ చేశారు.
దీని గురించి చిన్మయి మాట్లాడుతూ ``ఇప్పటి వరకు శ్రోతలకు మూడు వేల వీడియోలు పంపాను.ఇందులో శ్రోతల కోరిక మేరకు పాటలు పాడి అంకితమివ్వడం, శుభాకాంక్షలు చెప్పడం చేస్తున్నాను. దాతలు అవసరం ఉన్న వారి అకౌంట్స్‌లోకే అమౌంట్‌ను నేరుగా జమ చేశారు. క్లిష్ట సమయంలో నిత్యావసర వస్తువులు కొనలేని స్థితిలో ఉన్నవారికి, ఫీజులు కట్టలేని వారి కోసం డబ్బులను నేరుగా సాయం చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓ ఎన్నారై, ఇరవై కుటుంబాలకు 1.5 లక్షల విరాళం అందించారు. ఓ విద్యార్థి రూ.27 విరాళాన్ని ఇచ్చారు. ఇలా చాలా రకాలుగా వ్యక్తలు సాయం అందించారు. ప్రపంచంలో ఎంతో దయ ఉంది. మానవత్వం ఇంకా ఉందనే నా నమ్మకాన్ని రెట్టింపు చేసింది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments