అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని తెలిపింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ లేకపోతే ఎంట్రీకి అనుమతించవద్దని తెలిపింది. ప్రజా రవాణాలో సైతం కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.
ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారని నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని.. మైక్ అనౌన్స్‌మెంట్ చేయాలని సూచించింది. సినిమా హాళ్లలో సైతం కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శనలు ఉండేలా చూడాలని పేర్కొంది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout