అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని తెలిపింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ లేకపోతే ఎంట్రీకి అనుమతించవద్దని తెలిపింది. ప్రజా రవాణాలో సైతం కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారని నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని.. మైక్ అనౌన్స్‌మెంట్‌ చేయాలని సూచించింది. సినిమా హాళ్లలో సైతం కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శనలు ఉండేలా చూడాలని పేర్కొంది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

More News

రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 'అరుంధతి'తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ 'ఎక్స్‌పైరీ డేట్‌'కి మంచి స్పందన లభిస్తోంది! - మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ

ప్రభాస్‌ 21లో బిగ్‌ బి

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా రేంజ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.